
శ్రీ నాళం వారి సత్రము, మెయిన్ రోడ్, రాజమహేంద్రవరం.
(సత్రము వ్యవస్థాపక దినోత్సవము, విజయదశమి సందర్భంగా శుభాకాంక్షలతో...)
కీ॥శే॥ దానకర్ణ శ్రీనాళం పెదభీమయ్య గారు సత్రం వ్యవస్థాపకులు
దాత ఆశయాలకు వన్నె తెచ్చే శ్రీనాళం వారి సత్రం – "శతమానం భవతీ" అనే వైదికాశీస్సులతో నిండు నూరేళ్ళ జీవించమన్నది మన పెద్దల ఉవాచ. భారతీయ ప్రమాణాల ప్రకారం ఇది పరిపూర్ణాయుష్, నూరు అనేది ఒక ఘనత, అది ఆధీకృతను సూచిస్తుంది. రాజమహేంద్రవరం చరిత్రలో ఇలా నూరేళ్ళ ఉనికిని చాటుతూ 1879 సంవత్సరములో స్థాపించిందని అంటే అది సత్రమును ఉదారతతో నెలకొల్పిన ఆ కుటుంబ సభ్యుల దర్మశీలతకు దూరదృష్టికి చక్కని తార్కాణము. అటువంటి ధీరోధాత్తులు, సత్పురుషులైన మానవతావాది, పరిపూర్ణ సహృదయులైన శ్రీ నాళం వారి వ్యవస్థాపకులు దానకర్ణ శ్రీశ్రీశ్రీ నాళం పెద్ద భీమయ్యగారి అవసాన కాలమున ది. 13-5-1879 రాజమహేంద్రవరం నందు అన్నదాన సత్రం స్థాపించుటకు రూ. 25,00,000/- దారాదత్తం చేసి స్వర్గస్తులైరి. వీరి ఆశయం మేరకు వీరి కుటుంబికులు ఇంకనూ విరాళములు ఇచ్చి ఇప్పటి సత్రం మరియు జిల్లాలో సుమారు 431 యకరములు భూములు కొనుగోలు చేసింది. ది. 14-10-1879 విజయదశమి నాడు బ్రాహ్మణ భోజనాలతో సత్రం ప్రారంభించినారు. 1979వ సంవత్సరములో సత్రంను దేవాదాయధర్మాదాయశాఖకు అప్పగించినారు. ప్రస్తుతం "శ్రీ నాళం వెంకటేష్"గారు సత్రమునకు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా వ్యవహరించుచున్నారు. ఈ సత్రం యొక్క దాతల ముఖ్య ఆశయముల ప్రకారము : 1) పేద ప్రజల కుమార్తెల వివాహములకు ఆర్థిక సహాయము. 2) పేద ప్రజలకు వైద్య సేవల నిమిత్తము ఆర్థిక సహాయము. 3) ప్రతీ శనివారం రాజమండ్రి సత్రంలో ఉచిత హోమియో ఆసుపత్రి నిర్వహించి ఉచితముగా ముందులు పంపిణి. 4) ప్రతీ ఆదివారం చొల్లంగి సత్రం బిల్డింగునందు ఉచిత హోమియో ఆసుపత్రి నిర్వహించి, ఉచితముగా ముందులు పంపిణి. 5) రాజమండ్రిలోని శ్రీ వైశ్య సేవా సదనం నందలి విద్యార్థినులకు రెండు పూటలా చక్కని భోజనం. 6) పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చుట. 7) చొల్లంగి అమావాస్య సందర్భంగా చొల్లంగిలో భక్తులకు ఉచిత పులిహోర, మజ్జిగ, మంచినీరు, వితరణ చేపట్టుట జరుగుచున్నది. 8) చొల్లంగి గ్రామంలో 15 లక్షల రూపాయలతో సత్రం బిల్డింగు నిర్మాణం చేయడమైనది. 9) స్థానిక జాంపేటలోని శ్రీ సీనియర్ నేషనల్ బేసిక్ స్కూలు విద్యార్థులకి ఉచితముగా యూనిఫారములు పుస్తకాలు పంపిణి. 10) శ్రీ గౌతమి గోరక్షణ సంఘంలోని గోవులకు ఫీడింగ్ నిమిత్తం ప్రతి నెల ఆర్థిక విరాళం ఇచ్చుట. 11) శ్రీనాళం సత్రం వ్యవస్థాపకులు శ్రీనాళం పెద్ద భీమయ్యగారి స్వగ్రామం సమీపంలో గల శ్రీ సోమేశ్వరస్వామివారికి లక్షపత్రిపూజ, కళ్యాణం నాడు పట్టు వస్త్రములు సమర్పించుట, మరియు భారీ అన్నసమారాధన నూతన కార్యక్రమములు ప్రారంభించబడినది. 12) ప్రతి పుష్కరాలకు భారీ అన్నసమారాధన నిర్వహించబడును.
శ్రీ నాళం వెంకటేష్, బి.ఎ., ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ & ఛైర్మన్
సి.హెచ్. దారబాబు, కార్యనిర్వహణాధికారి మరియు సిబ్బంది.
