తాజా వార్తలు
కామితార్థ ప్రదాయిని శ్రీ లలితాదేవి ప్రణమామ్యహం

కామితార్థ ప్రదాయిని శ్రీ లలితాదేవి ప్రణమామ్యహం

October 6, 2026
భక్తి

ఓం శ్రీ లలితాదేవి నమోస్తుతే. పాహి పాహి శ్రీ లలితాదేవి॥

డి. బాల దివాకర్ - చరవాణి (ఫోన్) - 9849482883

శరన్నవరాత్రుల వేళ ప్రముఖ రచయిత ఆధ్యాత్మిక విషయాల అన్వేషి, మృధుభాషి, సాధుస్వభావి – డి. బాల దివాకర్

కలం నుండి జాలువారిన మరో ఆణిముత్యంలాంటి పాట "శ్రీ లలితాదేవి" నామాల ఆధారంగా తేట తేట, లేలేత తెలుగు పదాలతో పామరులు కూడా సునాయసంగా భక్తి పారవస్యంతోద ఆలపించుకొనే నవ అచ్చ తెలుగు పాట ఇదే ఇదే.. అమ్మల కన్న అమ్మ జగన్నాత అంటేనే శ్రీ లలితా పరమేశ్వరి ఇటువంటి పాటు రాయాలన్న, పాడాలన్న ఆ అమ్మవారి అనుగ్రహం పూరజన్మ సుకృతం ఉండాలి. ఆ రీతిలో పునికి పుచ్చుకున్నవారే దివాకర్. మూడున్నర నిమిషాల నిడివి గల "రహస్య లలితా సహస్రనామ స్తోత్రం" పరోక్షంగా, ప్రత్యక్షంగా ఈ పాటో మనకు ప్రతీ చరణంలో చ్యోదకం అవుతుంది. ఇంకెదుకు ఆలస్యం. ఆ మృదు మధురమైన పాటలోకి రసరమ్యంగా పదండి పదండి....

"పరమం పదం దివ్య చరణం, సతకోటి తేజోమయం, సతతం స్మరణం తవ దివ్య నామం, బహుజన్మ పుణ్య ఫలదాయకం, అంబ శ్రీలలితే, అంబ శ్రీ లలితేనను బ్రోవుమా నను బ్రోవుమా మామ్ పాహిమామ్ రక్షమాం. గ్రామ్యమౌ విషయాలీవేళ మౌనమే వరించగా ఏకమౌ తఫముల ఫలమో నీ పదములను చేర్చగా నా కావ్యమే ఉపచారమై మానసం నైవేద్యమై తలపులు పలుకులు చేతు తెలిపే పరమపదం తవదివ్య చరణం, శతకోటి సూర్య తేజోమయం, సతతం స్మరణం తవ దివ్య నామం, బహుపుణ్య ఫలదాయం అంబా శ్రీలలితే అంబా శ్రీలలితే నను బ్రోవుమా నను బ్రోవుమా మామ్ పాహిమామ్ రక్షమాం.

కామితార్థ ప్రదాయిని శ్రీ లలితాదేవి ప్రణమామ్యహం 2
Advertisement Space
Google AdSense will appear here
300 x 250 Banner
⚠️ Slot ID not configured
📖
Advertisement Space
Google AdSense will appear here
300 x 250 Sidebar
⚠️ Slot ID not configured